![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -268 లో....శౌర్యకి ఏదైనా అయితే నువ్వు బ్రతకవని తెలిసి నిజం చెప్పలేదని దీపతో కార్తీక్ చెప్తాడు. ఆపరేషన్ కి డబ్బు కావాలి కదా అని దీప అడుగుతుంది. వస్తాయని కార్తీక్ సమాధానం చెప్తాడు. అసలేం జరుగుతుంది.. ఎవరిని నమ్మాలో అర్ధం కావడం లేదని సుమిత్ర అంటుంది. ఒకసారి దీపకి ఫోన్ చెయ్ అని దశరథ్ అంటాడు. జ్యోత్స్న చెప్పింది కదా అని సుమిత్ర అనగానే.. తను చెప్పింది నిజమని మనం ఎందుకు అనుకోవాలి.. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు అన్నావ్ కదా దీప కి ఫోన్ చెయ్ అని దశరథ్ అంటాడు.
దీపకి ఫోన్ చేస్తుంది సుమిత్ర. కానీ తను లిఫ్ట్ చెయ్యదు. కాంచనకి ఫోన్ చేస్తుంటే తను కూడా అంత అవమానం తర్వాత ఎలా మాట్లాడుతుందని దీప లిఫ్ట్ చెయ్యదు. కార్తీక్ కి దీప ఫోన్ చేస్తుంది. ఇప్పుడు లిఫ్ట్ చేస్తే అంత చెప్పాలి.. బాధపెట్టడం తప్ప ఏం లేదని కార్తీక్ లిఫ్ట్ చెయ్యడు. ఎవరు లిఫ్ట్ చెయ్యడం లేదని సుమిత్ర బాధపడుతుంటే.. దీన్ని బట్టి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అర్థం అవుతుందని దశరథ్ అంటాడు. ఇల్లు తీసుకొని డబ్బు ఇవ్వండి అని తన ఊళ్ళో వాళ్ళని అనసూయ అడుగుతుంది. ఇల్లు దీప పేరున ఉంది అయినా అంత డబ్బు ఒకేసారి అంటే కష్టమని వాళ్ళు అంటారు. కార్తీక్ దగ్గరికి డాక్టర్ వచ్చి.. డబ్బు ఇంకా కట్టలేదు.. కడితేనే ట్రీట్ మెంట్ నడుస్తుందని అంటాడు. డబ్బులు ఎలా వస్తాయని దీప అడుగుతుంది. వస్తాయని కార్తీక్ అనగానే.. నాతో అబద్దం చెప్తున్నారని దీప అంటుంది. నా దగ్గర ఇప్పుడు అబద్ధాలు తప్ప ఏం లేవని కార్తీక్ డబ్బు గురించి తన ప్రయత్నం గురించి చెప్తాడు.
వెళ్లిన పని అవ్వలేదంటూ కాంచనతో అనసూయ చెప్తూ బాధపడుతుంది. దీప దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి.. నేను డబ్బు ఇస్తానంటూ కోటి రూపాయల చెక్కు ఇస్తుంది. అరకోటి నీ బిడ్డ ప్రాణం కోసం.. అరకోటి నా ప్రాణం అయిన బావ కోసం నీ తాళిని నాకు ఇచ్చేయమని జ్యోత్స్న అడుగుతుంది. ఇందులో బావకి నీకు సంబంధం లేదు అన్నట్లు రాసి ఉంది.. దాంట్లో సంతకం చెయ్.. మిగతాది మొత్తం నేను చూసుకుంటానని జ్యోత్స్న అనగానే.. దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |